Amara raja group donation to AP Flood Victims: తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులకు అమరరాజా గ్రూపు విరాళం ప్రకటించింది. ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి రెండు కోట్లు, తెలంగాణ సీఎం రిలీఫ్‌ఫండ్‌కు కోటి రూపాయలు చొప్పున విరాళం అందించారు. అమరరాజా గ్రూపు సహవ్యవస్థాపకురాలు గల్లా అరుణ కుమారి ఈ మేరకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి విరాళానికి సంబంధించి చెక్కులను అందజేశారు. మరోవైపు తమకు ఇంతకాలం మద్దతుగా నిలుస్తున్న తెలుగు ప్రజలకు కష్ట సమయంలో అండగా ఉండటం తమ బాధ్యతను గ్రూపు ఛైర్మన్ గల్లా జయదేవ్ అన్నారు.