కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. రాజదాని అమరావతి నిర్మాణ పనులు ఊపందుకున్నారు. రాజధానికి మరింత రైలు, రోడ్డు మార్గాల కనెక్టివిటినీ పెంచి.. దేశంలోని అన్ని నగరాలతో అనుసంధానం చేయనున్నారు. ఈ క్రమంలో అమరావతికి రైల్వే మార్గం విషయంలో కీలక పురోగతి చోటుచేసుకుంది. ఎర్రుపాలెం-నంబూరు రైల్వేలైన్ నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. 27 కి.మీ. ట్రాక్‌తోపాటు కృష్ణా నదిపై 3.2 కి.మీ. వంతెన నిర్మాణానికి రెండు నెలల్లో టెండర్లు పిలవనున్నారు.