ఏపీలో ఇప్పుడు త్రీ వైజ్ మంకీస్ తరహా క్యాంపెయిన్ హాట్ టాపిక్‌గా మారింది. రాజధాని అమరావతితో పాటుగా పలు ప్రధాన నగరాల్లో సోషల్ మీడియా వాడకంపై చైతన్యపరుస్తూ హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. ఫోర్త్ మంకీ బొమ్మతో సోషల్ మీడియాను మంచి కోసం మాత్రమే వాడుదాం అనే సందేశం వినిపిస్తూ సోషల్ మీడియాను ఎలా వాడాలనే దానిపై అవగాహన కల్పిస్తున్నారు. అయితే ఈ హోర్డింగ్స్ ఎవరు ఏర్పాటు చేయించారనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులపై ఏపీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న వేళ.. ఈ క్యాంపెయిన్ చర్చనీయాంశమైంది.