Anagani Satyaprasad: ఆంధ్రప్రదేశ్‌లో భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెరుగుతాయని ప్రభుత్వం తెలిపింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఏపీలో భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెంచనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో భూముల రిజిస్ట్రేషన్ విలువలు తగ్గించనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం రిజిస్ట్రేషన్ విలువల పెంపును సరిగా చేయలేదని మండిపడ్డారు. సగటున 15 శాతం నుంచి 20 శాతం వరకు ఈ రిజిస్ట్రేషన్ విలువ పెంపు ఉంటుందని వెల్లడించారు.