ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో గ్యాస్ లీక్ ఘటన కలకలం రేపింది. అనకాపల్లి జిల్లాలోని పరవాడ ఫార్మాసిటీలోని ఠాగూర్ లేబొరేటరీలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం లీకైంది. ఈ ఘటనలో ఓ కార్మికుడు చనిపోగా.. మరో 9 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిని సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అస్వస్థతకు గురైన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. మరోవైపు పరవాడ ఫార్మాసిటీ గ్యాస్ లీక్ ఘటనపై సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.