హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు. త్వరలోనే మంచి నీటి కష్టాలు తీరిపోనున్నాయి. ఈ మేరకు చర్యలు చేపట్టినట్లు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి వెల్లడించారు. గోదావరి ఫేజ్-2, 3 పనులు జరగుతున్నాయని ప్రతి రోజూ నీళ్లు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రానున్న రెండేళ్లలో రోడ్లపై నీటి ట్యాంకర్లు కనిపించకుండా చేస్తామని అన్నారు.