ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న విశాఖ విమానాశ్రయం సేవలు ఇక ముగిసినట్టే. విజయనగరం జిల్లా భోగాపురం వద్ద అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించడంతో విశాఖ సేవలు ముగిసిపోయాయి. 16వ తేదీ అర్ధరాత్రితో విశాఖ విమాన సేవలు బంద్ కానుండగా.. ఆగస్టు 17 00:01 నుంచి భోగాపురం పూర్తి సేవలు ప్రారంభంకానున్నాయి. విశాఖ విమానాశ్రయంలో నాన్ షెడ్యూల్డ్ వాణిజ్య కార్యకలాపాలు కొనసాగనున్నట్లు పౌర విమానయాన శాఖ తెలిపింది. విశాఖ ప్రజలకు ఇప్పటి వరకు ఓ అనుభూతిని కలిగించిన విమానాశ్రయం ఆ ప్రాంత ప్రజలకు ఓ ఎమోషన్ అనే చెప్పొచ్చు.