Anantapur Gun Fire: కాల్పుల కలకలం.. ఒక్కసారిగా ఉలిక్కిపడిన అనంతపురం.. అసలేమైందంటే?

2 months ago 7
అనంతపురంలో సోమవారం కాల్పుల కలకలం రేగింది. అనంతపురంలోని విద్యుత్‌ నగర్‌ వద్ద ఆదివారం రాత్రి దేవరకొండ అజయ్ అనే వ్యక్తి మద్యం మత్తులో రాజా అనే వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో రాజా గాయపడ్డాడు. రాజా ఫిర్యాదు మేరకు అనంతపురం టూటౌన్ సీఐ శ్రీకాంత్ దేవరకొండ అజయ్‌ను అదుపులోకి తీసుకునేందుకు ఆకుతోటపల్లి వెళ్లారు. అయితే నిందితుడు అజయ్ సీఐపైనా కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో సీఐ శ్రీకాంత్ చేతికి గాయమైంది. అజయ్ కత్తితో దాడి చేయడంతో సీఐ శ్రీకాంత్ అతనిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో అజయ్ గాయపడ్డాడు. అనంతరం అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Entire Article