విదేశాలకు విహార యాత్రకు వెళ్లిన వైద్యులు.. అక్కడ నుంచి తిరిగొస్తూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. టూర్‌లో సంతోషంగా గడిపి.. ఆ ఆనందంలో స్వస్థలాలకు చేరుకుంటున్న వారిని మృత్యువు కబలించింది. విమానం దిగి రోడ్డు మార్గంలో వస్తుండగా.. పొగ మంచు కారణంగా వారు ప్రయాణిస్తోన్న కారు అదుపు తప్పింది. అనంతరం పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టడంతో అందులోని వైద్యులు తీవ్ర గాయాలతో చనిపోయారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలోని ఆదివారం ఉదయం చోటుచేసుకుంది.