Anantapur: ఒక్కడి దెబ్బకు అధికారులందరికీ షాక్..! కలెక్టర్ కీలక నిర్ణయం.. ఆదేశాలు జారీ

1 year ago 11
అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికారిక సమావేశాల్లో సెల్ ఫోన్ వినియోగంపై నిషేధం విధించారు. అధికారిక సమావేశాలకు వచ్చే ముందు ఫోన్లు స్విఛాఫ్ చేయాలని.. కుదరని పక్షంలో సైలెంట్‌లో ఉంచాలని సూచించారు. అలా కాకుండా సమావేశం మధ్యలో సెల్ ఫోన్ వాడితే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు అనంతపురం జిల్లా కలెక్టర్ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల జరిగిన ఓ సమావేశంలో డీఆర్వో మలోల ఆన్ లైన్ రమ్మీ ఆడుతూ దొరికిన ఘటన తెలిసిందే. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
Read Entire Article