పొలాల్లోని టమాటాలను తినడానికి వచ్చిన ఏడు జింకలపై రెండు చిరుతలు దాడిచేసి హతమార్చాయి. ఈ ఘటన అనంతపురం గ్రామీణ మండలం తాటిచర్ల గ్రామంలో జరిగింది. స్థానికంగా ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది. అయితే, తన పంటను కాపాడుకోవడానికి రైతు వేసిన కంచె.. జింకల పాలిట మృత్యుపాశంగా మారింది. అయితే, ఆ ప్రాంతంలో చిరుతల సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. వాటిని వీలైనంత త్వరగా బంధించి, ముప్పు నుంచి కాపాడాలని కోరుతున్నారు.