హిందువుల తొలి పండుగ వినాయక చవితి. కులమతాలకు అతీతంగా 9 రోజుల పాటు ఎంతో ఆనందంగా చేసుకుంటారు. ఊరూవాడా అంతా ఒకచోటు చేరి మండపాల్లో ప్రత్యేక పూజలు, సాంస్కృతిక వేడుకలతో నవరాత్రులను భక్తిశ్రద్ధలతో జరుపుకుని, చివరి రోజున ఊరేగింపు చేపట్టి, ఊరి చివరి చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. కానీ, ఓ గ్రామంలో వినాయకుడ్ని ప్రతిష్టించి, ప్రత్యేక పూజలు చేయకుండానే గంగమ్మ ఒడికి చేర్చారు. దీనికి కారణం గ్రామంలోని ఇరువర్గాల మధ్య జరిగిన వాగ్వదమే.