తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున చట్టసభ వద్ద పోలీసులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య తోపులాట జరిగిన విషయం తెలిసిందే. మూడో నెంబరు గేటు వద్ద జరిగిన ఈ ఘటనపై ఓ మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు. విధుల్లో ఉన్న తమ పట్ల అనుచితంగా ప్రవర్తించారని, దూషణలు, బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. అయితే, శాసనసభ ఎదుట ఈ ఘటన ఎలా జరిగిందనే కోణంలో సిట్ కూపీ లాగుతుంది. ఇందుకోసం కేటీఆర్ పీఏ, పీఆర్వోలను పోలీసులు విచారణకు పిలిచారు.