కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహోత్సవాలకు సర్వాంగ సుందరంగా తిరుమల ముస్తాబైంది. సెప్టెంబరు 15 నుంచి 23 వరకు జరిగే ఉత్సవాల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు టీటీడీ అధికారులు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం అంకురార్పణం జరిగింది. శ్రీవారి సేనాని విష్వక్సేనుడి సమక్షంలో ఈ క్రతువును జరిపించారు. ఇక, మంగళవారం ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు.