భాగ్యనగరంలో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా.. భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. ఇక, ప్రముఖ వ్యాపార కేంద్రమైన బేగంబజార్‌లో వజ్రాలు, బంగారం పొదిగిన వినాయకుడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఫీల్‌ఖానాలో కొలువుదీరిన గణనాథుడ్ని సుమారు 48 కిలోల బరువుతో అత్యంత నైపుణ్యంతో రూపుదిద్దుకుంది. ఈ ‘బంగారు గణేశుడు’ ఎంతగానో భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్నాడు. కళ్లారా దీనిని వీక్షించేందుకు నగరం నలుమూలల నుంచి జనం పోటెత్తుతున్నారు. ఖైరతాబాద్, బాలాపూర్‌తో పాటు ఇది కూడా ఎంతో విశేషంగా ఆకట్టుకుంటోంది.