Anantapur Man Records Selfie Video On His Wife: అనంతపురం జిల్లాలో ఓ యువకుడు సెల్ఫీ వీడియో రికార్డు చేసి కనిపించకుండా పోయాడు. తన భార్య తనను కొద్దిరోజులుగా వేధిస్తోందని అనిల్ అనే యువకుడు వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. తాను ఆమె బెదిరింపుల్ని భరించలేకపోతున్నాను అన్నాడు. అందుకే ఈ జీవితం ఇక చాలని.. తల్లిదండ్రులు తనను క్షమించాలన్నాడు. అమ్మనాన్నల్ని బాగా చూసుకోవాలని వీడియోలో సోదరుడ్ని రిక్వెస్ట్ చేశాడు. ఈ వీడియో వైరల్ కాగా.. అనిల్ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. ఈ నెల 27న అనిల్ ఇంటి నుంచి వెళ్లినట్లు చెబుతున్నారు.