ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌కు అదనంగా మరో 6.5 కోట్ల పనిదినాలు కేటాయించింది. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. కేంద్రం నిర్ణయం కారణంగా ఏపీలోని 53 లక్షల కుటుంబాలకు లబ్ధి కలుగుతుందని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. పనిదినాలు పెంచినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలియజేశారు.