Vangalapudi Anitha Comments on Constable Recruitment: ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగ యువతకు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత శుభవార్త చెప్పారు. అతి త్వరలోనే కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్న వంగలపూడి అనిత .. ప్రస్తుతం రాష్ట్రంలో పోలీసుల కొరత ఉన్నట్లు చెప్పారు. దీనిని అధిగమించేందుకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని వెల్లడించారు. అటు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు కూడా త్వరలోనే పోలీస్ శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు.