Chandrababu inaugurate Anna Canteenat Vuyyuru: ఏపీలో అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఆగస్ట్ 15వ తేదీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తొలి అన్న క్యాంటీన్ ప్రారంభించనున్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఆగస్ట్ 15 రోజు సాయంత్రం ఆరున్నరకు చంద్రబాబు అన్న క్యాంటీన్ ప్రారంభిస్తారు. మిగతా 99 అన్న క్యాంటీన్లు మరుసటిరోజు మంత్రులు ప్రారంభించనున్నట్లు తెలిసింది. మొత్తంగా ఆగస్ట్ 15 సందర్బంగా వంద అన్న క్యాంటీన్లను ఏపీ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువస్తోంది. మిగతా వాటిని సెప్టెంబర్ నెలాఖరులోగా అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.