AP Bus Falls Into Valley: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింతూరు-మారేడుమిల్లి ఘాట్‌రోడ్డులో ప్రైవేటు బస్సు లోయలో పడి 8 మంది దుర్మరణం చెందారు. భద్రాచలం నుంచి అన్నవరం వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.