సచివాలయం వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సుమారుగా 70 అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. అలాగే పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ వ్యవస్థ ఏర్పాటుకు ఆమోదం లభించింది. అలాగే రాష్ట్రంలో ఇల్లు లేని వారందరికీ.. ఇళ్లు దక్కేలా చూడాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు చంద్రబాబు సూచించారు. నివాస స్థలం లేని వారిని గుర్తించి సంవత్సరం లోపు వారికి లబ్ధి జరిగేలా చూడాలంటూ చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.