AP Cabinet: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం కల్పించారు. అమరావతిలో రూ.2733 కోట్ల పనుల కోసం కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అదే సమయంలో మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్‌కు ఏపీ మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 14 అంశాలపై ఏపీ మంత్రివర్గ సమావేశంలో చర్చకు రాగా ఆమోదించారు. ప్రధాని మోదీ.. విశాఖ పర్యటన గురించి మంత్రివర్గ సమావేశంలో చర్చ జరగ్గా.. సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు.