ఏపీలో ఇటీవల భారీ వర్షాలు, వరదలు వణికించిన సంగతి తెలిసిందే. పలు ప్రాంతాల్లోకి వరదనీరు చేరి స్థానికులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. నిత్యావసరాలతో పాటుగా టీవీలు, ఫ్రిడ్జిలు వంటి ఎలక్ట్రానిక్ సామాన్లు దెబ్బతిన్నాయి. దీంతో కంపెనీలు బాధితుల పట్ల మానవత్వంతో వ్యవహరించాలని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. సీఎం పిలుపునకు ఎలక్ట్రానిక్ సంస్థ ఎల్‌జీ స్పందించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులకు ఉచితంగా సర్వీస్ అందించేందుకు ముందుకు వచ్చింది. అలాగే స్పేర్ పార్టులపైనా యాభైశాతం రాయితీ ఇస్తున్నట్లు వెల్లడించింది.