ఏపీ వాసులకు అలర్ట్.. మరో పథకం పేరు మారింది. అధికారంలోకి వచ్చిన తర్వాత గత వైసీపీ ప్రభుత్వంలో తీసుకువచ్చిన అనేక పథకాల పేర్లను మారుస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం.. తాజాగా మరో పథకం పేరును మార్చింది. వైఎస్ జగన్ తెచ్చిన శాశ్వత భూ హక్కు - భూ రక్ష పథకం పేరును ఏపీ ప్రభుత్వం మార్చింది. దీనిని ఏపీ రీ సర్వే ప్రాజెక్టుగా నామకరణం చేసింది. ఈ మేరకు ఏపీ రెవెన్యూశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ తెచ్చిన ఈ పథకం అమల్లో లోపాలు ఉన్నాయని అప్పట్లో టీడీపీ ఆరోపించింది. తాము అధికారంలోకి వస్తే ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చింది.