ఏపీలో ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి ప్రభుత్వం తీపికబురు వినిపించింది. పేదల ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఈ విషయాన్ని తెలిపారు. భవన నిర్మాణ రంగంలోకి కార్మికులకు గతంలో అమలుచేసిన అన్ని సంక్షేమ పథకాలను తిరిగి అమల్లోకి తెస్తామన్నారు. ఉచిత ఇసుక విధానం రద్దు చేసి వైసీపీ ప్రభుత్వం భవన నిర్మాణ రంగంలోని కార్మికుల పొట్టకొట్టిందన్న మంత్రి.. తాము అధికారంలోకి వచ్చాక మళ్లీ ఉచిత ఇసుక విధానం తీసుకువచ్చిన సంగతిని గుర్తుచేశారు.