grama ward sachivalayam employee attendance new rule in AP: ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం.. వైసీపీ హయాంలో అనుసరించిన మరో విధానాన్ని తీసుకువచ్చింది. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు మూడు పూటల హాజరు వేయాలని స్పష్టం చేసింది. గత ప్రభుత్వంలోనే ఈ విధానం ఉండగా.. క్షేత్రస్థాయిలో సరిగా అమలు కాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి ఆదేశాలు ఇచ్చారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు రోజుకు మూడుసార్లు బయోమెట్రిక్ ద్వారా అటెండెన్స్ వేయాలని తాజా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తారు.