ఆంధ్రప్రదేశ్ హైకోర్టు హోంగార్డులకు భారీ ఊరట ఇచ్చింది. కానిస్టేబుళ్ల భర్తీ ప్రక్రియలో హోంగార్డులను ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఏపీ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డును హైకోర్టు ఆదేశించింది. ఆరు వారాల్లోగా ప్రత్యేక మెరిట్ జాబితా తయారీ చేయాలని ఏపీ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డును ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.