AP Liquor Policy: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం.. రాష్ట్రంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేస్తూ.. తాజాగా ఆర్డినెన్స్ జారీ చేసింది. రిటైల్ మద్యం దుకాణాలకు అనుమతినిస్తూ చట్ట సవరణ చేసింది. ఇక గత ప్రభుత్వంలో ఉన్న మద్యం పాలసీని రద్దు చేసి.. కొత్త మద్యం పాలసీని తీసుకువచ్చే క్రమంలో ఈ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది.