Visakhapatnam Vijayawada Metro Rail Projects Changes: విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు సంబంధించి డీపీఆర్‌లను కేంద్రానికి పంపించిన సంగతి తెలిసిందే. అయితే కేంద్రం ఏపీ ప్రభుత్వం పంపించిన డీపీఆర్‌ను పరిశీలించి.. ఈ ప్రాజెక్టులపై కొన్ని సూచనలు, మార్పులు చెప్పింది.. దీంతో విశాఖపట్నం, విజయవాడలో మెట్రో రైలు కోసం మరోసారి సర్వే చేయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే సర్వే ప్రక్రియను పూర్తిచేసి కేంద్రానికి మరోసారి నివేదికను పంపించాలని భావిస్తున్నారు.