ఏపీలో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. రాష్ట్రంలో నూతన మద్యం విధానం అక్టోబర్ 16 నుంచి అమల్లోకి వచ్చింది. ఇక మందుబాబుల ఎదురు చూపులకు తెరదించుతూ ఫేమస్ బ్రాండ్లన్నీ లిక్కర్ షాపుల్లో కొలువు దీరాయి. అయితే ఈ మూడు రోజుల వ్యవధిలోనే మద్యం అమ్మకాల ద్వారా ఏపీ ఎక్సైజ్ శాఖకు రూ.530 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిసింది. శుక్రవారం మధ్యాహ్నం నాటికి రూ.530 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక రేపటి కల్లా రాష్ట్రవ్యాప్తంగా 100 శాతం మద్యం దుకాణాలు తెరుచుకుంటాయంటున్నారు.