మార్చి 14వ తేదీన పిఠాపురంలో జరగాల్సిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం రద్దు చేశారు. పెరుగుతున్న ఎండలు, వేడి వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పార్టీ అద్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రస్థాయి కార్యక్రమం బదులుగా నియోజకవర్గాలు, మండల కేంద్రాలు, పంచాయతీలలో స్థానిక నేతలు ఆవిర్భావ దినోత్సవం నిర్వహించుకోవాలని జనసేన పార్టీ పిలుపునిచ్చింది. ఆవిర్భావ కార్యక్రమాలను సురక్షితంగా నిర్వహించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.