కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ఘటన తీవ్ర కలకలం రేపింది. కరీంనగర్ డిపోకు చెందిన బస్సు నిజామాబాద్ వెళ్తూ ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లారీ క్యాబిన్‌లో చిక్కుకున్న డ్రైవర్‌ను స్థానికులు బయటకు తీసుకొచ్చారు.