ఆంధ్రప్రదేశ్‌లో మరో రైల్వే లైన్ ఏర్పాటు కానుంది. ఏపీని తమిళనాడును అనుసంధానించే పుత్తూరు అత్తిపట్టు రైల్వే లైన్ భూసేకరణ పనులకు రైల్వే శాఖ అనుమతి ఇచ్చింది. మొత్తం 88.3 కిలోమీటర్ల మేరకు అత్తిపట్టు పుత్తూరు రైల్వే లైన్ నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు గతంలోనే కేంద్రం ఆనుమతి లభించగా.. పనుల్లో జాప్యం జరుగుతోంది. తాజాగా అత్తిపట్టు పుత్తూరు రైల్వే లైన్ ప్రాజెక్టు భూసేకరణకు రైల్వే శాఖ అనుమతి ఇవ్వటంతో పనుల్లో వేగం పెరిగే అవకాశం ఉంది.