ఆంధ్రప్రదేశ్‌లో మరో రైల్వే లైన్ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. చిత్తూరు జిల్లాలోని పుత్తూరు, తమిళనాడులోని అత్తిపట్టు మధ్య రైల్వే లైన్ ఏర్పాటు ప్రక్రియ వేగం పుంజుకుంది. అత్తిపట్టు - పుత్తూరు రైల్వే లైన్ రూట్ మ్యాప్‌ను అధికారులు సిద్ధం చేశారు. ఈ రూట్లో మొత్తం ఎనిమిది స్టేషన్లు ప్రతిపాదించారు. అందులో నాలుగు స్టేషన్లు ఏపీలో ఉండగా.. మరో నాలుగు స్టేషన్లు తమిళనాడులో ఉంటాయి. 88.30 కిలోమీటర్ల మేర పుత్తూరు - అత్తిపట్టు రైల్వే లైన్ ఏర్పాటుకు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ఈ రైల్వే లైన్ ఏర్పాటు పూర్తి అయితే తిరవల్లూరు - పుత్తూరు రూట్లో రద్దీ తగ్గుతుందని రైల్వేశాఖ భావిస్తోంది.