ప్రజారోగ్యం, ఆసుపత్రుల అభివృద్ధిపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందులో భాగంగా మూడు ఏరియా ఆస్పత్రుల అభివృద్ధికి నిధులు కేటాయించింది. పిఠాపురం, మంగళగిరి, చిలకలూరిపేట ఏరియా ఆస్పత్రుల అభివృద్ధికి నిధులు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం ఏపీ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ విభాగానికి 22 కోట్ల 74 లక్షల రూపాయలు అదనపు నిధులు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ కార్యదర్శి నుంచి దీనికి సంబంధించిన ఉత్తర్వులు విడుదల అయ్యాయి.