ఏపీవాసులకు ప్రభుత్వం తీపికబురు వినిపించింది. అక్టోబర్ 15 నుంచి ఏపీ వ్యాప్తంగా ఇసుక రీచ్‌లు తెరుచుకోనున్నాయి. ఈ విషయాన్ని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. అక్టోబర్ 15 నుంచి పూర్తిస్థాయిలో ఇసుక అందుబాటులో ఉంటుందని తెలిపారు. వైసీపీ విధానాల కారణంగానే ఇసుక తవ్వకాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న కొల్లు రవీంద్ర.. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇసుకను ఉచితంగా అందిస్తామన్నారు. మరోవైపు ఇటీవలే ఏపీ ప్రభుత్వం ఉచిత ఇసుక ఆన్‌లైన్ బుకింగ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.