AP News: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు చంద్రబాబు సర్కార్ శుభవార్త అందించింది. ఏపీలో 2.64 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం రాష్ట్రానికి రూ.1.83 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. రాష్ట్రంలో 9 కీలక ప్రాజెక్టుల ఏర్పాటుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 2028 నాటికి ఈ ప్రాజెక్టులు మొత్తం పూర్తి కావాలని సీఎం అధికారులను ఆదేశించారు.