ఏపీలో కొత్త ఎయిర్పోర్టుల ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఏడు విమానాశ్రయాలు ఉండగా.. వీటికి అదనంగా మరో ఏడు ఎయిర్‌పోర్టులు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుపై కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కొత్త ఎయిర్పోర్టుల ఏర్పాటుకు సర్వే జరపనున్నట్లు వెల్లడించారు. అలాగే విజయవాడ విమానాశ్రయం నుంచి కనెక్టివిటీ పెరిగేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.