గ్రామ పంచాయితీల ఆర్థిక ఇబ్బందులను దూరం చేసేలా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ఆర్ఎస్ , బీపీఎస్ పథకాల ద్వారా వచ్చే ఆదాయంలో గ్రామ పంచాయితీలకు వాటా ఇవ్వాలని నిర్ణయించింది. గ్రామ పంచాయితీలకు 50 శాతం,, అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలకు 30 శాతం, ఏపీ టౌన్ ప్లానింగ్ విభాగానికి 20 శాతం నిధులు చొప్పున కేటాయించాలని నిర్ణయించింది. ఈ కొత్త విధానంతో గ్రామ పంచాయితీలకు నిధుల కొరత తగ్గుతుందని అధికారులు చెప్తున్నారు.