AP News: సీఎం చంద్రబాబుపై మరోసారి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు.. పవన్ కళ్యాణ్ నటించిన ఖుషీ సినిమాలోని పాట పాడుతూ చంద్రబాబును ర్యాగింగ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పేది ఒకటి అయితే చేసేది మరొకటి అని ఎద్దేవా చేశారు. అభివృద్ధిని పక్కన పెట్టి.. చంద్రబాబు ప్రభుత్వం.. కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని అంబటి తీవ్రంగా మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇష్టం వచ్చినట్లు అప్పులు చేస్తున్నారని దుయ్యబట్టారు.