ఏపీలోని విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ నుంచి వియత్నాం దేశానికి త్వరలోనే విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని భారత్‌లోని వియత్నాం అంబాసిడర్ ఎంగ్యూయేన్ థాన్హయ్ వెల్లడించారు. వైట్ జెట్ ద్వారా ఏపీ నుంచి వియత్నాంకు నేరుగా విమాన సర్వీసులు నడిపేలా చూస్తామని ఎంగ్యూయేన్ తెలిపారు. విజయవాడలో ఏపీ- వియత్నాం మధ్య జరిగిన కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న ఎంగ్యూయేన్.. ఈ విషయాన్ని వెల్లడించారు. ఏపీ- వియత్నాం మధ్య పర్యాటక, సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.