సంక్షేమ పథకాల అమలు, పౌర సేవలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం అందించే పథకాలు, వివిధ కార్యక్రమాలపై ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. ఐవీఆర్ఎస్ విధానం ద్వారా ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా లోటుపాట్లను గుర్తించి మరింత మెరుగైన సేవలు అందించవచ్చని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.