ఏపీలోని సామాజిక భద్రతా పింఛన్లపై సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పింఛన్లు తొలగిస్తారంటూ ప్రచారం జరుగుతున్న వేళ కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ సంక్షేమశాఖపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు. ఈ విషయాన్ని ప్రస్తావించారు. పింఛన్ల తొలగింపు అనేది తప్పుడు ప్రచారమన్న చంద్రబాబు.. పింఛన్ల తనిఖీ చేపడుతున్నట్లు చెప్పారు. దివ్యాంగుల పింఛన్లలో అనర్హులు ఉన్నారనే నివేదికల నేపథ్యంలో పింఛన్ల తనిఖీ కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు. అర్హులైనవారికి పింఛన్లు అందుతాయని స్పష్టం చేశారు.