కొవ్వూరు జనసేన ఇంఛార్జ్ టీవీ రామారావును ఆ పదవి నుంచి తొలగిస్తూ జనసేన అధిష్టానం నిర్ణయం తీసుకుంది. పార్టీ విధానాలకు విరుద్ధంగా ఆయన వ్యవహరించారని పేర్కొంది. అయితే, సొసైటీలు, ఏఎంసీ కమిటీల ఏర్పాటులో జనసేనకు తగిన ప్రాధాన్యత లేదని రామారావు ఆరోపించారు. ఈ క్రమంలోనేో టీవీ రామారావును ఇంఛార్జి పదవి నుంచి తప్పించారు. ఇదే సమయంలో కొవ్వూరు వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశించారు.