ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కీలక పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మల్లారెడ్డిని హైదరాబాద్ తరలించి.. విచారణ చేసేందుకు ఏసీబీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.