బాసర జ్ఞాన సరస్వతి ఆలయ పరిధిలోని మహాకాళి అమ్మవారి గర్భగుడి తాళాలు పగలగొట్టి వెండి కిరీటం, హుండీని దొంగలు అపహరించారు. ఉదయం సుప్రభాత సేవకు వచ్చిన ప్రధాన అర్చకులు శ్రీనివాస్ ఈ చోరీని గుర్తించారు. ఈ ఘటనపై తెలంగాణ బీజేపీ ట్విట్టర్ ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. దేవుడి సొమ్ముకు రక్షణ ఇవ్వలేని ఈ ప్రభుత్వానికి అధికారంలో ఉండే నైతిక హక్కు లేదని, ఇది హిందూ ధర్మంపై జరుగుతున్న వివక్షకు నిదర్శనమని మండిపడింది.