హైదరాబాద్ మెట్రో విస్తరణకు ఉన్న అడ్డంకులు తొలిగిపోయాయి. పలువురు కేంద్రమంత్రులతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి.. మెట్రో ఫేజ్-I స్వాధీనంతోపాటు.. ఫేజ్-2 విస్తరణకు సంబంధించి చర్చలు జరిపారు. కన్సల్టెంట్‌గా ఎస్‌బీఐ క్యాప్స్ వ్యవహరిస్తుందని.. ఆ సంస్థ ఇచ్చిన నివేదిక ఆధారంగా తదుపరి నిర్ణయాలు ఉంటాయని నిర్ణయించారు. మెట్రో రెండోదశ విస్తరణ, ఐఆర్ఎఫ్‌సీ రుణం సహా పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.