తీవ్ర వాయుగుండం తీరం దాటింది. పూరీ వద్ద 11 గంటల 30 నిమిషాల సమయంలో తీవ్రవాయుగుండం తీరం దాటినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. సోమవారం అర్ధరాత్రికి బలహీనపడనుంది. దీని ప్రభావం మరో 24 గంటలపాటు ఉంటుందని చెప్తున్నారు. వాయుగుండం ప్రభావంతో ఏపీలోని ఉత్తరకోస్తా జిల్లాలతో పాటుగా ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటలు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.