ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. రేపు (మంగళవారం) పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఎన్టీఆర్, ఏలూరు. పార్వతీపురం మన్యం జిల్లాలలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అలాగే మిగతా జిల్లాలలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. మరోవైపు ఆగస్ట్ 29న నాటికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది.