ఆంధ్రప్రదేశ్‌కు తుపాను ముప్పు దూసుకొస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రవాయుగుండం మారింది. రేపటికల్లా ఇది తుపానుగా మారనుంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల వాసులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అలాగే బుధవారం సాయంత్రం నుంచి తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయని.. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని హెచ్చరించింది.